ప్రగతిపథంలో మోడల్‌ స్కూళ్లు : సత్తా చాటుతున్న విద్యార్థులు

ప్రగతిపథంలో మోడల్‌ స్కూళ్లు : సత్తా చాటుతున్న విద్యార్థులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. పూర్తి ప్రభుత్వ నిధులతో...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. పూర్తి ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ పాఠశాలల ద్వారా పేదవిద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందజేస్తున్నారు. అంతేకాకుండా ప్రయివేట పాఠశాలలకు ధీటుగా పాఠాలను ఆంగ్ల మాద్యమంలో విద్యా్ర్థులకు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలను తీసుకొస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు పోటీ పరీక్షలను కూడా సమర్థవంతంగా రాసి మంచి ఫలితాలకు పొందుతున్నారు. అంతే కాకుండా ఈ పాఠశాలలో 6వ తరగతినుంచే వృత్తి విద్యా నైపుణ్యం కోర్సులను కూడా అందిస్తున్నారు.

అంతేకాకుండా ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌, నీట్‌ వంటి ప్రవేశపరీక్షల్లో ర్యాంకులు సాధించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇదే కోణంలో గత విద్యాసంవత్సరంలో ఎనిమిది మంది విద్యార్థులు జేఈఈలో సీటు సాధించారు. మరో ఐదుగురు విద్యార్థులు ఎంబీబీఎస్‌ కళాశాలల్లో సీట్లు సాధించారు.

ఇక పోతే ఇప్పటివరకూ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యను అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ194 పాఠశాలలు ఉండగా, 100 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను కూడా ఏర్పాటు చేశారు.

2018-19 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 210 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్ల ఏవరేజ్‌తో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్‌ స్కూళ్లలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను 1,32,116 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ప్రవేశం పొందారు. ఇందులో 6-10 తరగతి వరకు 95,122 మంది విద్యార్థులు ఉండగా, ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో 36,994 ప్రవేశాలు పొందారు. ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు మంచి ఫలితాలను పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories