Enforcement Directorate: క్యాసినో, గ్రానైట్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

* ఈడీ ముందుకు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, తలసాని పీఏ హరీష్

R Tripura Malini
Published on: 21 Nov 2022 11:29 AM IST
ed investigation in casino and granite case is going strong
X

క్యాసినో, గ్రానైట్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Enforcement Directorate: క్యాసినో, గ్రానైట్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యాసినో కేసులో డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, మంత్రి తలసాని పీఏ హరీష్ విచారణకు హాజరుకానున్నారు. మరికొందరు వ్యాపారులను సైతం ఈడీ విచారించనుంది. ఇప్పటికే తలసాని సోదరులను సిట్ విచారించింది. ఇవాళ కరీంనగర్ గ్రానైట్ కంపెనీల యజమానులను విచారించనున్నారు. విదేశాలకు గ్రానైట్ బ్లాక్‌ల ఎగుమతుల అవకతవకలు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేయనున్న ఈడీ అధికారులు... హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీయనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story