Top
logo

ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే జరిమానా తప్పదు...

లోకేశ్ కుమార్
X
లోకేశ్ కుమార్
Highlights

ప్రస్తుత కాలంలో ఏ కార్యక్రమం చేయాలన్నా, అడ్వర్ టైస్ మెంట్ చేయాలన్నా, మొదటగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు...

ప్రస్తుత కాలంలో ఏ కార్యక్రమం చేయాలన్నా, అడ్వర్ టైస్ మెంట్ చేయాలన్నా, మొదటగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ ప్లెక్సీలు బ్యానర్ల కారణంగా ఇప్పటి వరకూ అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది. నగరంలో అనధికారికంగా పెట్టే ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాట్లను నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.

నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే వారికి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో ఇదీ ఒక భాగమేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారికి జరిమానాలు విధించాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు. అంతే కాక ఈ నెల 20వ తేదీలోపు నగరంలోని రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని సంబంధిత సిబ్బంధికి సూచించారు. ఈ గుంతల కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు.Web TitleDo not set up Flexi and Banners without government permission
Next Story