తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. బలమైన నేతలు బీజేపీలోకి రావాలి: డి.కే.అరుణ

తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. బలమైన నేతలు బీజేపీలోకి రావాలి: డి.కే.అరుణ
x
Highlights

కేంద్ర బడ్జెట్ పై టిఆర్ఎస్ నేతల విమర్శలు సర్వసాధారణం అన్నారు బీజేపీ నేత డికే.అరుణ. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడు...

కేంద్ర బడ్జెట్ పై టిఆర్ఎస్ నేతల విమర్శలు సర్వసాధారణం అన్నారు బీజేపీ నేత డికే.అరుణ. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పలేదన్నారామె. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బురద చల్లుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని బలమైన నేతలు బీజేపీలోకి రావాలని డి.కే.అరుణ పిలుపు నిచ్చారు. కేవలం పేరు కోసమే పాత సచివాలయం కులుస్తున్నారని డీకే అరుణ అన్నారు. తెలంగాణను కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఇప్పటివరకు 50శాతం మందికి రైతు బంధు అందలేదన్నారు. కేంద్ర నిధుల వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అరుణ తెలిపారు. వచ్చే మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని డికే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న డికే, టీఆరెస్ పార్టీ కి బీజేపీ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు.కాంగ్రెస్ పార్టీ కి మళ్ళీ అధికారం లోకి వచ్చే అవకాశాలు లేవని, అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేశారుని ఎద్దేవా చేసారు అరుణ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories