నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ హరిత

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ హరిత
x
Highlights

రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలలో విద్యార్థులకు ఏవిధంగా సౌకర్యాలు అందుతున్నాయో తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాల్లోని కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలలో విద్యార్థులకు ఏవిధంగా సౌకర్యాలు అందుతున్నాయో తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాల్లోని కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ బాటలోనే వరంగల్ రూరల్ కలెక్టర్ కూడా నడిచారు. సంగెం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను కలెక్టర్‌ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు.

వసతిగృహంలో వంటలు ఏ వుంటున్నాయో తెలుసుకుని, ఆహారం సరిగ్గా వడ్డిస్తున్నారా లేదా, నాన్యమైన భోజనం అందిస్తున్నారా అన్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత విద్యార్థులు కూడా అన్ని వసతులు పొందాలనీ, అది విద్యార్థుల హక్కు అని వారికి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని మంచి చదువులు చదివి మంచి స్థాయికి రావాలని కలెక్టర్‌ హరిత అన్నారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ వసతి గృహాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని, హాస్టల్ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో తమ తల్లిదండ్రులను వదిలి వచ్చి వసతి గృహాల్లో ఉంటున్నారని, వారి పట్ల సిబ్బంది ప్రేమగా మెలగాలనీ తెలిపారు. వారికి తగిన అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యం విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories