Top
logo

తెలంగాణలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వివాదం

తెలంగాణలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వివాదం
X
Highlights

* పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ * ఆవుల తరలింపులో పోలీసులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ * జీతం సరిపోకపోతే పోలీసులకు బిచ్చమెత్తి డబ్బులిస్తామన్న రాజాసింగ్ * రాజాసింగ్ వ్యాఖ్యలపై సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఫైర్

తెలంగాణలో పోలీసులు .. బిజేపి నేతలకు మధ్య వివాదం రాజకుంటోంది. దుబ్బాక ఎన్నికల నాటి నుండి బిజేపి నేతలు పోలీసుల టార్గెట్ గా కామెంట్స్ చేస్తుండడంతో పోలిసులు సున్నితంగా ఎదురుదాడిని ప్రారంభించారు. దీంతో పోలీసులకు రాష‌్ట్ర బిజేపి నేతలకు మధ్య వివాదం రగులుతోంది.

తెలంగాణలో బిజేపి నేతలకు...పోలీసులకు మధ్య వివాదం రాజకుంటోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బిజేపి నేతలు గత కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నంటూ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సిద్దిపేటకు వెట్టడానికి ప్రయత్నం చేస్తే... ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన తీరు బిజేపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో బిజేపి నేతల తీరును తప్పుబట్టారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లిల్లో ,రైతుల ఆందోళనకు మద్దతుగా బంద్ కు పలుపు సందర్భంగా పోలీసులు షాపులను మూసేయించడాన్ని బిజేపి తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ సంజయ్ మండిపడ్డారు కూడ. తాజగా బిజేపి ఎమ్మెల్యే రాజసింగ్ పోలీసులు ఆవులను అక్రమంగా తరలిస్తున్నా.. పోలీసులు అడ్డుకోకుండా అక్రమంగా తలరించే వారికి సహకరిస్తున్నారంటూ వాఖ్యాలు చేయడంతో తాజ వివాదానికి కారణం అయ్యింది.

ఇటీవల శంషాబాద్ లో బిజేపి ఎమ్మెల్యే రాజసింగ్ పోలీసులను పై చేసిన సంచల ఆరోపణలు పోలీసులకు ఆగ్రహం తెప్పించన్నట్లు కనిపిస్తోంది. పోలీసులు ఆవులను అక్రమంగా తరలించే వారికి బ్రెకర్లుగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులకు జీతం సరిపోయేలా ఇవ్వకపోతే... తామే ప్రజల్లో బిచ్చేమొత్తుకొని బ్రోకర్లుగా వ్యవహరించే వారికి డబ్బులు ఇస్తామని రాజసింగ్ అనడం పోలీసులకు ఆగ్రహం తెప్పించిన్నట్లు కనిపిస్తోంది. అందుకే పోలీసులు సైతం అంతే ఘాటుగా బిజేపి నేతల పై సైఫరాబాద్ కమీషనర్ సజ్జనార్ వాఖ్యలు చేశారు. బిజేపి నేతలు పోలీసులను టార్గెట్ చేసే విదంగా వాఖ్యలు చేయడం పోలీసులందర్ని అవమానించేలా ఉందని పోలీసులు మండిపడ్డారు. ఎక్కడన్న పోలీసులు తప్పు చేేస్తే బిజేపి నేతలు డిజిపికి ఫిర్యాదు చేయాలని కాని ప్రజలకు సేవచేస్తున్న వారిని అవమానించేలా వాఖ్యలు చేస్తే... కేసులు పెడుతామంటూ హెచ్చరించారు.

అయితే.. వెంటనే బిజేపి ఎమ్మెల్యే రాజసింగ్ స్పందించారు. పోలీసులకు రాజసింగ్ ప్రతిసవాల్ చేశారు. సైఫరాబాద్ పరిదిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు అది నిజంకాదా....? పోలీసు ఇంటలిజెన్స్ వాళ్లు దగ్గర రిపోటర్ట్ తెప్పించుకొని నేను చేసిన వాఖ్యలు తప్పు అయితే... కేసులు పెట్టుకోవచ్చు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నా అన్నారు. అక్రమంగా ఆవులను తరలించడాన్ని పోలీసులు అడ్డుకోగలుగుతే... మేము సహకరిస్తాం. మీరు కామెంట్స్ చేస్తే.. మేమూ ఇలాంట్ స్ చేయడానికైన సిద్దంగా ఉంటామంటూ ప్రతిసవాల్ విసిరారు.. రాజాసింగ్. రాజాసింగ్ సవాలుకు పోలీసులు స్పందిస్తారా... లేక సైలెంటు అవుతారా చూడాలి.

Web TitleDispute between BJP leaders and Hyderbad police
Next Story