ఇందూరుపై డెంగీ పంజా

ఇందూరుపై డెంగీ పంజా
x
Highlights

ఇందూరుపై డెంగీ పంజా విసిరింది. దగ్గు-జలుబు-జ్వరాలతో జనం వణికిపోతున్నారు. ముసురు-పట్టి వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి.

ఇందూరుపై డెంగీ పంజా విసిరింది. దగ్గు-జలుబు-జ్వరాలతో జనం వణికిపోతున్నారు. ముసురు-పట్టి వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి. విషజ్వరాలతో ప్రభుత్వాస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరగ్గా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే, డెంగ్యూ పేరుతో డేంజర్ గేమ్‌ అడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, చికెన్ ఫాక్స్‌, టైఫాయిడ్‌ తదితర వ్యాధులు ముప్పేట దాడి చేస్తుండటంతో జనం ఆస్పత్రుల ముందు క్యూకడుతున్నారు. చిన్న పిల్లల హాస్పిటల్స్ అయితే కిక్కిరిసిపోతున్నాయి.

ప్రతి నలుగురిలో ఒకరు దగ్గు-జలుబు-జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు. అయితే, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే, వందలాది మంది వైరల్‌ ఫీవర్స్ బారినపడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకధాటిగా వర్షాలు, వాతావరణంలో మార్పులతోనే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు... తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే అనారోగ్యం బారినపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. విషజ్వరాల ముప్పేట దాడితో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అదే అదునుగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories