Corona Effect: హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు..

Corona Effect: హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు..
x
Highlights

నగరంలోని పర్యాటక కేంద్రాలను చూడడానికి ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. అదే విధంగా నెల రోజుల క్రితం సౌదీ అరేబియా దేశస్తులు నుంచి కొంత మంది వ్యక్తులు నెలరోజుల పాటు పర్యటన కోసం తెలంగాణకు వచ్చారు.

నగరంలోని పర్యాటక కేంద్రాలను చూడడానికి ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. అదే విధంగా నెల రోజుల క్రితం సౌదీ అరేబియా దేశస్తులు నుంచి కొంత మంది వ్యక్తులు నెలరోజుల పాటు పర్యటన కోసం తెలంగాణకు వచ్చారు. కాగా వారందరూ కరోనాపై ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్‌‌లోనే చిక్కుకుపోయారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. సౌదీ వాసులకు సరైనా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేక పోవడంతో వారిని సౌదీకి అనుమతి అనుమతించడం లేదు.

దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బాధితులు శనివారం తమ సొంత దేశానికి వెళ్లేందుకు టికెట్లు తీసుకున్నారు. కానీ వారందిరీ వైద్యులు ఐసోలేషన్‌ వార్డులోనే ఉండాలని సూచించారు. అక్కడి నుంచి బయటికి వెళ్లేది లేదని ఆదేశాలు జారీ చేసారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోతే నిన్న కరోనా వైరస్ తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్నారని సమాచారం. కాగా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకు 60 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసారు. కాగా ఎవరైనా కరోనా అనుమానితులు ఆస్పత్రులకు వస్తే వారి వైద్య పరీక్షల రిపోర్టు వచ్చే వరకు వారిని ఆస్పత్రిలోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories