శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డన్ సెర్చ్...

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డన్ సెర్చ్...
x
Highlights

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం తెల్లవారు జామున పోలీసులు కార్డన్ సెర్చ్ ను నిర్వహించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్...

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం తెల్లవారు జామున పోలీసులు కార్డన్ సెర్చ్ ను నిర్వహించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ సెర్చలో ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, సుమారు 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. లైసెన్స్ లేకుండా అంతర్జాతీయ టెర్మినల్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో తనిఖీలు నిర్వహించామన్నారు.

అనుమతులు లేని వాహణాలను డ్రైవర్లు నడుపుతున్నారన్న సమాచారం రావడంతోనే ఈ కర్డెన్ సెర్చ్ ను నిర్వహించామని డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. సరైన పత్రాలు లేని ఆరు టాక్సీలను కూడా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు.

జులై నెలలో కూడా ఇలాంటి సమాచారం రావడంతోనే పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారని వారు తెలిపారు. అప్పుడు 16 మంది అనుమానితులను, 12 కార్లను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ప్రయాణికులు అనుమతులు ఉన్న టాక్సీలలోనే ప్రయాణించాలని డీసీపీ ప్రయాణికులను సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories