అటు పట్నం గోస.. ఇటు పట్టణ ప్రగతి

అటు పట్నం గోస.. ఇటు పట్టణ ప్రగతి
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయి పల్లెలు అభివృద్ది చెందాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయి పల్లెలు అభివృద్ది చెందాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించింది ప్రభుత్వం. కాగా ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ 'పట్నం గోస' అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ ఆ హామీలని వారు నెరవేర్చలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న మురికివాడలను అభివృద్ది చేసి పట్టనాన్ని మురికివాడల రహితం చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పలుమార్లు చెప్పారని అన్నారు. కానీ ఇప్పటి వరకూ వాటి గురించి వారు పట్టించకోలేదని, ఇచ్చిన హామీలను కార్యరూపం దాల్చలేదని ఆయన ఆరోపించారు.

ఇక ప్రతపక్ష పార్టీ రూపొందించిన పట్నం గోస కార్యక్రమాన్ని సోమవారం రోజున మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రోజుకో లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రోజుకో కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు నిర్వహించబోతున్నారు.

కాగా మొదటిరోజు ప్రధాన ఎజెండాగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం ఇండ్ల లబ్ధిదారులతో సమావేశమయి వారితో మాట్లాడనున్నారు. అనంతరం డబులో బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేసే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పనుల పురోగతి, నిర్మాణ పనుల ప్రారంభంపై సంప్రదింపులు జరపనున్నారని రేవంత్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యు లు, నియోజకవర్గాల్లోని పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories