ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం దురదృష్టకరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం దురదృష్టకరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
x
MLA Komatireddy Rajagopal Reddy (file photo)
Highlights

అసెంబ్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను అసెంబ్లీ నుంచి గెట్ ఔట్ అనడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అసెంబ్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను అసెంబ్లీ నుంచి గెట్ ఔట్ అనడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయనను ఉరికించి కొడతానన్న మంత్రి కేసీఆర్ ఏమీ అనలేదని తనను మాత్రం ఈ విధంగా అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సభును సీఎం కేసీఆర్ పక్కదోవ పట్టించారు కానీ నేను పక్కదారి పట్టించలేదని ఆరోపించారు. తాను అసెంబ్లీకి రావడం సీఎం పెట్టిన భిక్ష కాదని, ఈ రోజు అసెంబ్లీలో ఉన్నానంటే అది ప్రజలు దీవెన అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడే కృష్ణ జలాలలను నల్గొండకు తీసుకు వచ్చామని, గత ఆరు ఏండ్లనుంచి అక్కడ ఫ్లోరైడ్ లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు తప్పకుండా బుద్ది చెప్పుతారని ఆయన అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడుతానని, ప్రజల సమస్యలను గురించి ఆయన పట్టించుకుంటానని, ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తే ఊరుకోమని స్పష్టం చేసారు. మునుగొడుకు ఉపఎన్నిక వస్తుందని చిట్ చాట్‌లో మంత్రి జగదీష్ రెడ్డి అనడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని ఆయన ఎద్దేవా చేసారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories