Top
logo

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో ఎమ్మెల్యే
X
Highlights

కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో...

కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోగా.. ఎమ్మెల్యే లు సబితా ఇంద్రారెడ్డి, చిరుముర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరనున్నారన్న వార్త మరవకముందే.. తాజాగా ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు.. ఆ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి త్వరలో టీఆరెస్ లో చేరబోతున్నారు. ఇవాళ(గురువారం) మాజీ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు ఉపేందర్ రెడ్డి. ఈ సందర్బంగా టీఆరెస్ లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుపై పోటీ చేసి విజయం సాధించారు ఉపేందర్ రెడ్డి.

Next Story