యాదాద్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్

యాదాద్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం...

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణానికి గాను 750 కోట్ల నిధులను విడుదల చేసారు. ఇంత భారీ నిధులతో నిర్మింప చేస్తున్న ఆలయ అభివృద్ది పనులు దాదాపుగా పూర్తి కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఆలయ సందర్శనానికి సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలను అందుకోనున్నారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రధానఆలయం, ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు, కాటేజీకి సంబంధించిన పనులను పరిశీలిస్తారు. ఇప్పటివరకూ జరిగిన పనుల గురించి అధికారులతో సమీక్షించనున్నారు. దాంతోపాటు 2020 వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మహా సుదర్శనయాగం నిర్వహించడానికి అవసరమైన స్థలాన్ని, కావలసిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ ఏర్పాట్లను ఏ విధంగా చేయాలన్న విషయాలపై అధికారులతో మాట్లాడనున్నారు. సీఎం యాదాద్రి రాక సందర్భంగా వైటీడీఏ, జిల్లా అధికారులు, పోలీస్‌ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories