ఏటా నియంత్రితసాగు అలవాటుగా మారాలి: కేసీఆర్

ఏటా నియంత్రితసాగు అలవాటుగా మారాలి: కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

తెలంగాణలో ప్రతి ఒక్క రైతు నియంత్రిత సాగు విధానాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు.

తెలంగాణలో ప్రతి ఒక్క రైతు నియంత్రిత సాగు విధానాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు.నియంత్రిత సాగు విధానంలో గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని తెలిపారు. దీనికోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రైతుకు లాభం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి రైతు ఈ విధానాన్ని అవలంబించాల్సిందేనని చెప్పారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories