యాదాద్రికి 'గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' అవార్డు.. సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Praises On Yadadri Temple After Temple Win Green Place Of Worship Award
x

యాదాద్రికి 'గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' అవార్డు.. సీఎం కేసీఆర్ హర్షం

Highlights

Yadadri Temple: 2022- 25 సంత్సరాలకు గానూ ఆలయానికి అవార్డు

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక 'గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌' గుర్తింపును కైవసం చేసుకొంది. 40శాతం పచ్చదనంతో విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఈ ఆలయాన్ని నిర్మించడంతో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఈ గుర్తింపు ఇచ్చింది. గుహలో స్వయంభువుగా వెలిసిన 13వ శతాబ్దంనాటి స్వామివారి విగ్రహానికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ఆలయాన్ని నిర్మించినందుకు ఈ అవార్డు లభించినట్లు ఆలయ వైస్‌చైర్మన్‌ తెలిపారు. సన్‌ పైప్‌ ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చేయడంతోపాటు భక్తుల కోసం 14 లక్షల లీటర్ల సామర్థ్యం గల కొలను, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ గుర్తింపునకు మరో కారణమని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories