కేసీఆర్ : నేను గొంతు తెరిస్తే ఢిల్లీ వరకు వినపడుతుంది

కేసీఆర్ : నేను  గొంతు తెరిస్తే ఢిల్లీ వరకు వినపడుతుంది
x
Highlights

గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళణలను...

గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళణలను చేపట్టారు, ఎంతో మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. దీంతో ఈ చటంపై అన్ని పార్టీల నాయకులు అభ్యంతరాలను తెలిపారు. సీఏఏ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, ఎంఐఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా పలు పార్టీల నాయకులు 140 పిటిషన్లను దాఖలు చేశారు.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వందకు వంద శాతం తప్పుడు నిర్ణయమని, ఈ చట్టం వల్ల దేశానికి నష్టమే కానీ, లాభం లేదని, దీంతో దేశానికి మంచి జరగదని ఆయన అన్నారు. శనివారం (జనవరి 25) మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లు చెప్పామని తెలిపారు. ఈ విషయం పై ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడానని అన్నారు. కేసీఆర్ గొంతు తెరిస్తే ఢిల్లీ వరకు వినపడుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సెక్యులర్ పార్టీ అని, ఎవరికో భయపడి తమ సిద్ధాంతాలు మార్చుకోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఏఏను పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగంలో ఉందని, ముస్లింలను తక్కువ చేస్తే ఎలా అని, ఇది నాకు బాధ కలిగిచిందని ఆయన స్పష్టం చేసారు.

సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలని, దీనికోసం అవసరమైతే హైదరాబాద్‌లో 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. దేశంలో సమస్యలేవీ లేనట్లు ఈ పంచాయతీ ఎందుకంటూ ఎద్దేవా చేశారు. దేశం అట్టుడుకుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని సూచించారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం తెలిపారు. ఈ విషయం పై త్వరలోనే ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో ఓ సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశం హైదరాబాద్‌లోనే ఉంటుందని తెలిపారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్రం ఆర్టికల్‌ 370ని అమలు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్‌ చేసిందని అన్నారు. విధానాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దుతు తెలుపుతున్నాం అంటూ స్పష్టం చేశారు. అది దేశ గౌరవానికి సంబంధించింది అంశం కాబట్టే మద్దతు ఇచ్చామని తెలిపారు. భారత్‌ను మోదీ హిందూ దేశంగా మార్చుతున్నారంటూ ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ఆందోలన వ్యక్తం చేస్తున్నారని. ప్రశాంతంగా ఉన్న దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories