సాగుపై రైతులకు అధికారులు సూచనలు చేయాలి : సీఎం కేసీఆర్

సాగుపై రైతులకు అధికారులు సూచనలు చేయాలి : సీఎం కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలి నియంత్రిత సాగు విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలో అన్న విషయాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలి నియంత్రిత సాగు విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలో అన్న విషయాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో వానకాలంలో సాగు, విత్తనా లు- ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎం మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన వరి వంగడాలను ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం సూచించిన విధంగా వేయాలన్నారు. అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు.

వర్షాకాలంలో మక్క పంట వేయకూడదని దాని స్థానంలో కందులు లేదా పత్తి వేయాలని ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది వరకు పత్తి పంటను 53 లక్షల ఎకరాల్లో సాగు చేసారని, ఈ సారి 10-15 లక్షల ఎకరాలు పెంచి 60 నుంచి 70 లక్షల ఎకరాల వరకు సాగు చేయాలని తెలిపింది. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించాలని కోరింది. ఇక వరి పంట విషయానికొస్తూ గత ఏడాదిలాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలిపింది.

ఈ సందర్భంగానే గురువారం జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం అవ్వాలని తెలిపింది. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశం నిర్వహించాలని తెలిపింది. మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్లవారీగా ప్రణాళిక ఇవ్వాలని తెలిపింది. కల్తీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్ముతున్నట్టు తెలిస్తే సమాచారం రైతులు వెంటనే అధికారులకు ఇవ్వాలని తెలిపింది.

హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories