చికెన్, ఎగ్ మేళా.. 12 వేల మంది సందర్శకులు

చికెన్, ఎగ్ మేళా.. 12 వేల మంది సందర్శకులు
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 2800 మందికి పైగా మృతి చెందారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 2800 మందికి పైగా మృతి చెందారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి మనుషులకు మాత్రమే కాదు కోళ్లకు కూడా వస్తుందని, చికెన్ తింటే మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుందని పలు వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో చికెన్ ప్రియులు తమ ప్రాణాలకు కాపాడుకోవడానికి కోడి మాంసం తినడానికి ముందుకు రావడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. యజమానులు చికెన్ ధరలను తగ్గిస్తున్పప్పటికీ వారానికి 3.5 కోట్ల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. దీంతో వారి వ్యాపారాలకు ఎంతగానో నష్టం వాటిల్లుతుంది. ఇది కొనసాగితే ఇంకా నష్టపోవాల్సి వస్తుందని ఓ నిర్ణయానికొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు చికెన్, ఎగ్ మేళాను శుక్రవారం సాయంత్రం పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందాన కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని నెక్‌ సభ్యుడు జి రాంరెడ్డి తెలిపారు.

అంతే కాదు ఈ కార్యక్రమానికి 12 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)కు, చికెన్‌కు సంబంధం లేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేయనున్నారు. ఇందులో భాగంగా 6 వేల కిలోల చికెన్‌తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. చికెన్‌, గుడ్డు వినియోగం విషయంలో వచ్చే వార్తలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories