క‌రోనా ప్రాణాంత‌క‌మేం కాదు.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది: సీసీఎంబీ

క‌రోనా ప్రాణాంత‌క‌మేం కాదు.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది: సీసీఎంబీ
x
Highlights

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై భారత పరిశోధన సంస్థ (సీసీఎంబీ) చల్లని కబురు అందించింది.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై భారత పరిశోధన సంస్థ (సీసీఎంబీ) చల్లని కబురు అందించింది. ఇక్కడ ఉన్న వైరస్ అంత ప్రాణాంతకమేమీ కాదని, మన వారికి వ్యాధి నిరోధక శక్తి ఉండటం వల్ల దానిని తీవ్రతను అడ్డుకుంటుందని చెబుతోంది. భార‌త్ లో ఉన్న క‌రోనా వైర‌స్ అంత ప్రాణాంత‌క‌మేమీ కాదంటోంది భార‌త ప్రభుత్వ ప‌రిశోధ‌న సంసద్ సీసీఎంబీ.

రోజులు గ‌డిచే కొద్ది క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతోంద‌ని సీసీఎంబీ శాస్త్రవేత్త, డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా అభిప్రాయ‌ప‌డ్డారు. పైగా భార‌త ప్రజల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా క‌రోనాను కట్టడి చేసే సామ‌ర్థ్యం పెంచుకుంటుంద‌న్నారు. రోజు రోజుకు క‌రోనా వైర‌స్ త‌న తీవ్రత కోల్పోతున్న దృష్ట్యా… రాబోయే రోజుల్లో కేవ‌లం 10శాతం మంది క‌రోనా వైర‌స్ బాధితుల‌కు మాత్రమే ఆసుప‌త్రిలో చేర్చాల్సిన అవ‌స‌రం ప‌డుతుందన్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్, మందుల కోసం సీసీఎంబీ కూడా ప‌నిచేస్తోంది. అయితే.. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో కూడా వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని సీసీఎంబీ డైరెక్టర్ అన్నారు. ఒక‌వేళ వ‌చ్చినా అది అంద‌రికి అందుబాటులో ఉండేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని స్పష్టం చేశారు. ఇప్పటికే 100కు పైగా కంపెనీలు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్, మందుల కోసం ప‌నిచేస్తున్నాయ‌ని.. లక్షల మందిపై ప్రయోగాలు జ‌రిపి, అన్ని కుదిరితేనే వ్యాక్సిన్ భ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు.

దేశంలో హ‌ర్డ్ ఇమ్యూనిటి గురించి చ‌ర్చ సాగుతోంది. దేశం మొత్తం జ‌నాభాలో 50శాతం మందికి పైగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డితే హ‌ర్డ్ ఇమ్యూనిటి మొద‌లైన‌ట్లు భావించాలి. కానీ ఇండియా వంటి భారీ జ‌నాభా గ‌ల దేశంలో హ‌ర్డ్ ఇమ్యూనిటి ప్రయోగం ఫెయిల్ అయితే చికిత్స చేసేందుకు ఆసుప‌త్రులు ఏ మూల‌కు స‌రిపోవ‌ని రాకేశ్ మిశ్రా స్ప‌ష్టం చేశారు.

ఇక క‌రోనా వైర‌స్ ల్యాబులో త‌యారైంద‌న‌టానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని.. ఊహాగానాల‌తో ఓ దేశంపై నెపం వేయ‌లేమ‌న్నారు. అయితే వూహాన్ లోని వెట్ మార్కెట్ నుండి క‌రోనా వైర‌స్ బ్రేక్ అయిన‌ట్లు భావిస్తున్నప్పటికీ.. శాస్త్రీయంగా నిర్ధార‌ణ కావాల్సి ఉంద‌న్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories