Munugode: ఇవాళ నామినేషన్లు వేయనున్న మూడు పార్టీల అభ్యర్థులు

Munugode: మునుగోడులో నామినేషన్ల జోరు

Jyothi
Published on: 10 Oct 2022 8:22 AM IST
Candidates of three Parties will File Nomination Today
X

Munugode: ఇవాళ నామినేషన్లు వేయనున్న మూడు పార్టీల అభ్యర్థులు

Munugode: మునుగోడులో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఇవాళ మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటు సునీల్‌ బన్సాల్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాల్గొననున్నారు. ఇక.. చండూరుకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి. అలాగే.. ఇవాళ టీఆర్‌ఎస్‌ నుంచి మొదటిసెట్‌ నామినేషన్‌ వేయనున్నారు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. అటు.. కాంగ్రెస్‌ నుంచి ఇవాళ పాల్పాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మునుగోడు బైపోల్‌ నామినేషన్ల నేపథ్యంలో చండూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story