సరికొత్త రుచులను అందిస్తున్న బుల్లెట్‌ రెస్టారెంట్‌

సరికొత్త రుచులను అందిస్తున్న బుల్లెట్‌ రెస్టారెంట్‌
x
Highlights

ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం దొరకని రోజులివి. అష్టకష్టాలు పడి చదువుకున్న వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడలేదు.

ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం దొరకని రోజులివి. అష్టకష్టాలు పడి చదువుకున్న వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడలేదు. తాను కష్టపడి చదువుకున్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌తో ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. తన ఆలోచనలకు పదునుపెట్టి.. బిక్యూ చికెన్‌ మొబైల్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాడు.

మొబైల్‌ రెస్టారెంట్లు అనగానే కళ్ల ముందు నాలుగు చక్రాల ఆటోలు కన్పిస్తాయి. అందుకు బిన్నంగా బుల్లెట్‌ రెస్టారెంట్‌ నడిపిస్తున్నాడు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు చెందిన యువకుడు. బుల్లెట్‌ను రెస్టారెంట్‌గా తయారు చేసుకొని నోరూరించే రుచులను అందిస్తున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా కిసాన్‌నగర్‌కు చెందిన వరగంటి పవన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఉద్యోగం కోసం గల్ఫ్‌ బాట పట్టాడు. అయితే అక్కడ హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పనులు దొరక్కపోవడంతో గల్ఫ్‌ దేశాలకు స్వస్తి పలికాడు. తన సొంత ఊరిలోనే ఉపాధి పొందుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

కొన్ని డబ్బులు కూడబెట్టుకొని బుల్లెట్‌ బైక్‌ను స్పెషల్‌గా తయారు చేయించుకున్నాడు వరగంటి పవన్‌. ఈ వాహనంతో ఎక్కడైనా తన వ్యాపారాన్ని కొనసాగించే విధంగా షెడ్డు లాగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు 4వేల రూపాయలతో15 కిలోల చికెన్ తీసుకుని చికెన్ చిల్లి, చికెన్ బోన్‌లెస్, చికెన్ గ్రిల్‌తో పాటు రకరకాల వంటకాలను ఇంటివద్ద తయారుచేసి ఉపాధి పొందుతున్నాడు. రోజు 1500 నుండి 2000 వరకు లాభం వస్తుందని వరగంటి పవన్‌ తెలిపాడు.

చికెన్‌ను బొగ్గులపై వేస్తూ విక్రయిస్తున్నాడు. పవన్ చేస్తున్న వంటకాలకు చుట్టు పక్కల ప్రాంతాల వారు ఫిదా అవుతున్నారు. సొంత డిజైన్‌తో గ్రీల్ ఏర్పాటు చేసుకుని నిరుద్యోగులకు బాట చూపుతూ కొత్త ఆలోచనతో పవన్‌ ముందుకెళ్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories