పెళ్లిలో వరుడు ఏం చేసాడో తెలుసా..?

పెళ్లిలో వరుడు ఏం చేసాడో తెలుసా..?
x
Highlights

వివాహం అంటే చాలు తరతరాలు గుర్తుండిపోయే రీతిలో చేయాలని ఏర్పాట్లు చేస్తారు. అదిరిపోయే డెకరేషన్లు, విందుభోజనాలు, వచ్చిన అతిధులకు ప్రత్యేకమైన రీతిలో ఆతిధ్యం ఇవ్వడం ఇలా అన్నింటినీ ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు.

వివాహం అంటే చాలు తరతరాలు గుర్తుండిపోయే రీతిలో చేయాలని ఏర్పాట్లు చేస్తారు. అదిరిపోయే డెకరేషన్లు, విందుభోజనాలు, వచ్చిన అతిధులకు ప్రత్యేకమైన రీతిలో ఆతిధ్యం ఇవ్వడం ఇలా అన్నింటినీ ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెళ్లి కొడుకు మాత్రం తన వివాహం అందరి పెళ్లిలా కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఉండాలని వెరైటీగా ఆలోచించాడు. అందరి దృష్టినీ తన పెళ్లివైపే తిప్పుకునేట్టుగా ఏర్పాట్లు చేసాడు. దీంతో అక్కడున్న వారందరూ అతన్నిఓ పెద్ద సెలబ్రిటీనో లేక రాజకీయ నాయకుడో అని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ పెళ్లి గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ పెళ్లి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అసలు అతను ఏం చేసాడు. అతని పెళ్లిలో ఏంటా ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సింగ్యతాండాకు చెందిన బానోతు పుల్సింగ్ కుమారుడు రవితేజ.. ములుగు జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ పళ్లికోసం వరుడు 40 మంది బౌన్సర్లను నియమించుకున్నాడు. పెళ్లిలో తన చుట్టూ, వెంటనే నలుగురు బౌన్సర్లు ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. మండపంలో అక్కడడక్కడా కలిపి మొత్తం 40 మందిని నియమించుకున్నాడు.

తన పెళ్లి వాహనం చుట్టూ బౌన్లర్లు నడుస్తుంటే అతను వాహనంలో ఊరేగింపుగా మండపానికి తరలివచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఎవరో పెద్ద రాజకీయ నాయకుడని నోరెళ్లబెట్టారు. బౌన్సర్లను గుర్తుపట్టడానికి ప్రత్యేకంగా నల్ల సఫారీలు, నల్ల కళ్లజోళ్లను ఇచ్చారు. అంతే కాకుండా తన వివాహమండపం ప్రత్యేకంగా కనిపించడానికి రాజమండ్రి నుంచి పూవులను తెప్పించుకున్నాడు. దీంతో ఆ మండపం ప్రత్యేకంగా కనిపించింది.

ఇక పెళ్లికి హాజరైన వారంతా ఈ పెళ్లి తంతును చూడడం కంటే కూడా బౌన్సర్లను చూడడంతోనే సరిపోయింది. ఓ సాధారణ వ్యక్తి 40 మంది బౌన్సర్లను నియమించుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇలా పెళ్లిలో అన్ని ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఇతను వార్తల్లో నిలిచాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories