logo

కేసీఆర్ మాట మార్చారు.. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్న...

కేసీఆర్ మాట మార్చారు.. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్న...
Highlights

నేడు 73వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

నేడు 73వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఉద్యమసమయంలో విమోచన దినం జరపాలని అన్నటువంటి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మాట మార్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విరుచుకుపడ్డారు. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్న.. ఈ సారి మేము విమోచదినం జరుపుతాం. 70 ఏండ్ల కశ్మీర్ సమస్యకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చెక్ పెట్టారని, 18 రాష్ట్రాలల్లో 50శాతానికి పైగా ప్రజలు మోదీకి సంపూర్ణమదత్తు ఇస్తున్నారని అన్నారు. ఇకపోతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరమత సహనం పట్ల వేదాలు వల్లిస్తున్నారని, తెలంగాణలో ప్రజలు అభద్రత భావంలో ఉన్నారు. మజ్లీస్ ను చంకలో పెట్టుకొని కేటీఆర్ పరమత సహనం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


లైవ్ టీవి


Share it
Top