Telangana: రూ.10తో 60 కిలో మీటర్లు..ఓ యువ మెకానిక్ అద్భుత సృష్టి

Telangana: రూ.10తో 60 కిలో మీటర్లు..ఓ యువ మెకానిక్ అద్భుత సృష్టి
x
Representational Image
Highlights

అతను పెద్ద చదువులు చదువుకోలేదు. మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు. కానీ చదువుతో పనిలేకుండా తెలివితేటు ఉంటే చాలు దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు.

అతను పెద్ద చదువులు చదువుకోలేదు. మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు. కానీ చదువుతో పనిలేకుండా తెలివితేటు ఉంటే చాలు దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు. ఒక చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి పెట్రోల్ తో నడుస్తున్న ద్విచక్ర వాహనాన్ని బ్యాటరీతో నడిచే విధంగా రూపుదిద్దాడు.

ప్రస్తుత కాలంలో పెట్రోల్ బండ్ల కంటే కూడా చాలామంది బ్యాటరీ బండ్లు తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలను కొత్తగా మార్కెట్‌లోకి వదులుతున్నాయి. ఇక ఈ వాహనాల డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మెకానిక్ చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఫలించింది. కేవలం 30 వేల రూపాయలకే బ్యాటరీ వాహనం తయారవుతుంది.

పూర్తి వివరాల్లోకెళితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మెకానిక్‌ జానీబాబా ఈ వాహనాన్ని తయారు చేసాడు. దీని తయారికి లిథియమ్‌ అయాన్‌, ప్యారాసైటిక్‌ వంటి రకరకాల బ్యాటరీలను ఉపయోగించారు. బైక్ సామర్థ్యాన్ని బట్టి బ్యాటరీలు, ఏసీ డీసీ కన్వర్టర్‌ వంటి పరికరాలు ఉపయోగించి. వాటిని విద్యుత్తు మోటార్‌ సైకిళ్లుగా మారుస్తున్నాడు.

ఇక ఈ బైక్ ఒక్క సారి మూడు గంటల సేపు చార్జింగ్ పెడితే చాలు ఏకంగా 60కిలో మీటర్ల దూరం దూసుకుపోతుందని తెలిపారు. ఈ బైక్ చార్జింగ్ కి కేవలం 2 యూనిట్ల కరెంటు మాత్రమే ఖర్చవుతుందని, దానికి 10 రూపాయలు మాత్రమే బిల్లు పడుతుందని తెలిపారు. తనను ప్రోత్సహిస్తే ఇలాంటి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లను ఇంకా తయారు చేస్తనని ఆ ఔత్సాహిక యువ మెకానిక్ తెలిపారు. ఇక ఇకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ బైక్ ను కూడా బ్యాటరీ బైక్ గా తయారు చేయాలనుకుంటే ఇప్పుడే నల్గొండ బయలుదేరండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories