ఐస్ క్రీం తింటున్నారా.. అయితే జాగ్రత్త

ఐస్ క్రీం తింటున్నారా.. అయితే జాగ్రత్త
x
Highlights

చలిలో వేడి వేడి బజ్జీలు తినాలనిపిస్తుంది. వర్షంలో మొక్కజొన్నపొత్తులు తినాలనిపిస్తుంది. ఎండాకాలంలో చల్లని కూల్ డ్రింక్ లేదా ఐస్ క్రీం తినాలనిపిస్తుంది.

చలిలో వేడి వేడి బజ్జీలు తినాలనిపిస్తుంది. వర్షంలో మొక్కజొన్నపొత్తులు తినాలనిపిస్తుంది. ఎండాకాలంలో చల్లని కూల్ డ్రింక్ లేదా ఐస్ క్రీం తినాలనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఓ కుటుంబ సభ్యులు ఎండల వేడి నుంచి ఉపషమనం పొందడానికి రోడ్లపై అమ్ముతుండే ఐస్ క్రీం కొనుక్కొని తిన్నారు. బాగుంది అని తిన్న కొద్ది సేపటికే వారు ఒక్క సారిగా షాక్ అయ్యారు. వారు మాత్రమే కాదు ఆ చుట్టు పక్కన వారు కూడా ఒక్క సారిగా ఖంగారు పడ్డారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలసుకుందాం.

పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్ పాతబస్తీలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఫయాస్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు వీధిలో పోయే ఓ ఐస్ క్రీం బండి అతని దగ్గర ఐస్ క్రీం కొనుక్కొని తిన్నారు. ఆ తరువాత ఎవరైతే వాటిని తిన్నారో పిల్లలు, పెద్దలకు వెంటనే నోట్లో నుంచి రక్తం కారింది. దీంతో అందరూ ఒక్క సారిగా రిర్ఘాంత పోయారు. ఎందుకు ఇలా రక్తం వస్తుందని ఖంగారు పడ్డారు. ఈ ఘటన గురించి ఇరుగుపొరుగు వారికి తెలియడంతో అంతా ఆశ్చర్యపోయారు. తరువాత స్థానికులు వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెల్లారు.

అక్కడ వారిని పరీక్షించిన వైద్యుడు ఏం ప్రమాదం లేదని, నాలుక పగలడం వలన ఈ విధంగా జరిగిందని తెలిపారు. ఐస్ క్రీం తిన్న వెంటనే నోట్లో నుంచి రక్తం వచ్చినందుకు గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. సాధారణంగా ఐస్ క్రీంలో గడ్డకట్టేందుకు ఐస్ కలుపుతారని, ఈ ఐస్క్రీం బండి వాడు మాత్రం డ్రై ఐస్ కలిపాడని తెలిపారు. ఆ కారణంగానే ముగ్గురి నాలుకలు పగిలాయని, దాని వల్లే రక్తం వచ్చిందని చెప్పారు.

దీంతో ఆ కుంటుంబ సభ్యులు వెంటనే ఈ ఘటన గురించి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే యజమానిని పట్టున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇలాంటి ఐస్ ప్రాణాంతకమని వారు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories