Valentines Day: పార్కుల్లోకి నో ఎంట్రీ

Valentines Day: పార్కుల్లోకి నో ఎంట్రీ
x
Highlights

ప్రతి ఏడాది ఈ రోజున ప్రేమికులతో నిండి ఉండే హైదరాబాద్ పార్కులన్నీ ఈ ఏడాది వెలవెల బోతున్నాయి.

ప్రతి ఏడాది ఈ రోజున ప్రేమికులతో నిండి ఉండే హైదరాబాద్ పార్కులన్నీ ఈ ఏడాది వెలవెల బోతున్నాయి. ఒక వైపు ప్రపంచంలో ఉన్న ప్రేమికులంతా ప్రేమికుల రోజును ఎంతో సంబరంగా జరుపుకుంటుంటే హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ ఛాయలేమీ కనిపించడంలేదు. ఎప్పుడూ జనాలతో కిటకిట లాడే నగరంలోని పార్కులు, హోటల్స్, పర్యాటక ప్రాంతాలు ఈ రోజు వెలవెలబోతున్నాయనే చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో యువత ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఎవరైనా పార్కులకు వస్తే వారిని కచ్చితంగా అడ్డుకుంటామని భజరంగ్ దళ్, వీహెచ్‌పీ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. వారి హెచ్చరికలను పక్కన పెట్టి ఎవరైనా జంటలు పార్కులవైపు వస్తే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని చెప్పారు. ప్రేమికుల రోజు అనేది పాశ్చాత్య సంసృతి అని, దాన్ని జరుపుకోవడం విష సంస్కృతి అని వారు తెలిపారు.

గతంలో ప్రేమికుల రోజున పార్కులకు వచ్చిన వారికి కొన్ని సంఘాల వారు పెళ్లిలు చేసాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేసిన హెచ్చరికల మేరకు ప్రేమ జంటలు పార్కుల వైపునకు రావడానిక సాహసం చేయడం లేదు. నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యి పార్కుల్లోకి ప్రేమికులు రాకుండా అడ్డుకుంటున్నారు. అంతే కాకుండా వివాదస్పద ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక ముఖ్యంగా ఎక్కువగా ప్రజలు వచ్చే పార్కులను ఇప్పటికే పోలీసులు మూసేశారు.

ఇక పోతే గతేడాది ఈ రోజున ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, అబిడ్స్, సికింద్రాబాద్, ఇందిరాపార్కు, మూసాపేట్, బోయిన్‌పల్లి లాంటి అనేక ప్రాంతాల్లో జవాన్ల ఆత్మశాంతి కోసం వారికి నివాళులర్పిస్తామని బజరంగ్ దళ్ సంఘాలు తెలిపాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories