భద్రాద్రి రామయ్య కల్యాణ వైభోగం: తొలి ఘట్టానికి నేడు అంకురార్పణ

భద్రాద్రి రామయ్య కల్యాణ వైభోగం: తొలి ఘట్టానికి నేడు అంకురార్పణ
x
Highlights

తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భద్రాద్రి రామయ్య ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున సీతారాములు కళ్యానమహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భద్రాద్రి రామయ్య ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున సీతారాములు కళ్యానమహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడి విచ్చేస్తుంటారు. ఎన్నో ఏండ్ల నుంచి ప్రతి ఏడాది జరగుతున్న ఉత్సవాలను తిలకించి స్వామివారి ఆశీర్వాదాలను తీసుకుంటుంటారు.

ఇక ఈ ఏడాది నిర్వహించబోయే సీతారామ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పనులను ఆలయ అధికారులు ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నాడు కళ్యాణంలో ముఖ్యఘట్టమైన తలంబ్రాలు కలిపే ఘట్టానికి అంకురార్పణ చేసారు. ఆలయ చిత్రకూట మండపంలో ఈ తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం ఆలయ అధికారులు బియ్యం, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశారు.

అందులో భాగంగానే రోలు, రోకలికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పసుపుకొమ్ములు దంచారు. ఈ తలంబ్రాలను 150 క్వింటాళ్ల బియ్యంలో 100 కిలోల ముత్యాలు కలిపి తయారు చేసారు. ఇక ఈ వేడుకల అనంతరం స్వామి, అమ్మవార్లకు స్వపన తిరుమంజనం, వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories