పరీక్ష హాల్లో ఎమ్మెల్యే..

పరీక్ష హాల్లో ఎమ్మెల్యే..
x
Highlights

సాధారణంగా విద్యార్థులే పరీక్ష రాస్తారని తెలుసు కదా! కానీ ఓ ఎమ్మెల్యేనే పరీక్ష హల్లో ప్రత్యేక్ష్యం అయితే..? విద్యార్థుల తోటి బెంచి పక్కన కూర్చుంటే? ఇలాంటి ఘటనే కాకతీయ యూనివర్సిటీలో ఎదుదైంది.

సాధారణంగా విద్యార్థులే పరీక్ష రాస్తారని తెలుసు కదా! కానీ ఓ ఎమ్మెల్యేనే పరీక్ష హల్లో ప్రత్యేక్ష్యం అయితే..? విద్యార్థుల తోటి బెంచి పక్కన కూర్చుంటే? ఇలాంటి ఘటనే కాకతీయ యూనివర్సిటీలో ఎదుదైంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన ఎవరో కాదు..నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. అవును విద్యార్థులతోటి ముద్దుగా కూర్చుంది ఎమ్మెల్యేనే.. అదేంటి.. ఎమ్మెల్యే పరీక్ష రాసుడు ఎంది అనుకుంటున్నారా?..ఒక్కసారి పూర్తి కథనం చదవండి మీకే అర్ధం అవుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం ఫైనల్‌ ఇయర్‌ చదవుతున్నాడు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.

ఇందులో భాగంగానే శుక్రవారం క్యాంపస్‌లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం ఫైనలియర్‌ రెండో పేపర్‌ ఇన్సూరెన్స్‌ లా పరీక్షను ఆయన రాశారు. ప్రజాప్రతినిధిగా ఉంటునే.. చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఎమ్మెల్యే పక్కన కూర్చున్న విద్యార్థులు ఆశ్యర్యపోతునే.. తెగ సంబురపడ్డారు. మొత్తానికి ఈ పోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ ఫోటోపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శభాష్ ఎమ్మెల్యే గారు.. ప్రజాసమస్యలపై కొనసాగుతూనే.. ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేస్తున్నావ్ గ్రేట్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి రెం‍డోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories