Wanaparthy: మార్ఫింగ్‌ ఫొటోలతో వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

Wanaparthy: రూ.2వేలు లోన్‌ ఇచ్చి రూ.30వేలు చెల్లించాలని వేధింపులు

Jyothi
Published on: 24 Oct 2022 1:10 PM IST
Another Victim of Harassment by Loan App Administrators
X

Wanaparthy: మార్ఫింగ్‌ ఫొటోలతో వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

Wanaparthy: లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలైన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. 2వేల రూపాయలు లోన్‌ ఇచ్చి 30వేలు చెల్లించాలంటూ శేఖర్‌ అనే యువకుడిని నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా.. యువకుడి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించారు. దీనిని అవమానంగా భావించిన శేఖర్‌.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story