తెలంగాణలో మరో కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన శంఖారావం పార్టీ పేరుతో మరో నూతన పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ అధ్యక్షుడు పర్దిపూర్ నర్సింహా గతంలో ప్రజారాజ్యం , జనసేన...

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన శంఖారావం పార్టీ పేరుతో మరో నూతన పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ అధ్యక్షుడు పర్దిపూర్ నర్సింహా గతంలో ప్రజారాజ్యం , జనసేన పార్టీ లో తనదైన శైలిలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా వర్గాలు వెనక బడ్డాయని ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ పార్టీ నాయకులు తెలిపారు. ఆ వర్గాలకు చెందిన వారి ఆత్మాభిమానం, అభివృద్ధి, కోసమే ఈ పార్టీ స్థాపించారని వారు తెలిపారు. అంతే కాక వారి ఉనికిని ప్రజలకు చాటాలన్న ధృడమైన సంకల్పంతో ఈ పార్టీ ఉందని ఆ పార్టీ అనుచరులు తెలిపారు.

గడిచిన 72 ఏండ్లలో వెనుక బడ్డ వర్గాలకు ఏ పదవినైనా నామమాత్రంగానే ఇచ్చారని ఈ పత్రికా ప్రకటన ద్వారా ఈ పార్టీ నాయకులు తెలిపారు. అనగారిన వర్గాలు విద్యాపరంగ , ఉద్యోగ పరంగ, రాజకీయంగ వెనుకబడే ఉన్నారని తెలిపారు. దేశ ఉన్నతిని కోరుకొనే పౌరులకోసమే ఈ జన శంఖారావం పార్టీ నిలుస్తుందని యువత ముందుకొచ్చి వారి ఆశయాలను నేరవేర్చుకోవాలని యువతను ఆహ్వానించారు.

దీంతోపాటు ఈ పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని కూడా ఈ సందర్భంగానే ప్రకటించారు. వారిలో పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ, పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ , కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా , ఉమ్మడి కార్యదర్శిగా ఎ. గణేష్ రెడ్డి , నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్ , ఎం. రవి ముదిరాజ్ , కార్యనిర్వాహకులు - జె.అవినాష్ ( చింటు ) , ఎస్. శ్రీ శైలం యాదవ్ పేర్లను ఖరారు చేస్తూ పత్రికా ప్రకటనను వెలువరించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories