పింఛన్ల వడబోత ముమ్మరం

పింఛన్ల వడబోత ముమ్మరం
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నుంచి పింఛన్ ఇచ్చే విషయంలో కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నుంచి పింఛన్ ఇచ్చే విషయంలో కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే పెన్షన్ సొమ్ము రెట్టింపు చేసింది. ఇప్పుడేమో ఆసరా పింఛన్ల వడబోతను ప్రారంభించింది. దంపతులిద్దరికి వృద్ధాప్య పింఛన్ కు అర్హులైతే వారిలో ఒకరికి మాత్రమే పింఛన్ ను ఇస్తుంది, మరోకరికి కత్తెర పెడుతోంది. ఇందులో భాగంగానే మే నెల పింఛన్‌ సొమ్మును గ్రేటర్‌ వరంగల్‌ వ్యాప్తంగా 368 మంది లబ్ధిదారులకు జమ చేయలేదు. ఇదేంటి అని అడిగితే ఇప్పుడు పింఛన్ రాని వారికి ఇక మీదట పింఛన్‌ లేనట్లేనని బల్దియా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా, ఆహార భద్రత కార్డు, సదరన్‌ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ తదితర పత్రాల ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఉన్నట్లు గుర్తించింది. సామాజిక పింఛన్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఏరివేతపై దృష్టిసారించింది.

ఇక పోతే ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆసరా పథకం కింద ప్రభుత్వం 68,889 మంది పింఛన్‌ పొందుతున్నారు. వారలో వృద్ధులు 20,044, వితంతువులు 29,958, వికలాంగులు 8,720, ఒంటరి మహిళలు 1,786, బీడీ కార్మికులు 5,909, గీత కార్మికులు 639, చేనేత కార్మికులు 1,833 మంది ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories