ప్రైవేట్ ఆస్పత్రిలోని లిఫ్ట్‌లో పడి మహిళ మృతి

*చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వచ్చిన ప్రమీల

Jyothi
Updated on: 21 Sept 2022 9:30 AM IST
A Woman Died after Falling in the Lift of a Private Hospital
X

ప్రైవేట్ ఆస్పత్రిలోని లిఫ్ట్‌లో పడి మహిళ మృతి

Khammam: ప్రైవేట్ హాస్పిటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ లిఫ్ట్‌లో పడి మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఆస్పత్రిలో ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడంతో అమాంతం కిందకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందడంతో విషాదం నెలకొంది. వైరా మండలం గొల్లెనపహాడ్‌కు చెందిన ప్రమీల ఖమ్మంలోని తెలంగాణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వచ్చింది. బంధువుల దగ్గరకు వచ్చి తిరిగి వెళ్తూ లిఫ్ట్ బటన్ నొక్కింది. లిఫ్ట్ ఆమె ఉన్న ఫ్లోర్‌కి వచ్చిందనుకుని.. డోర్ ఓపెన్ చేసి ఫోన్ మాట్లాడుతూ అలానే లోపలికి వెళ్లిపోయింది. దాంతో అమాంతం కిందపడిన ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది. అయితే లిఫ్ట్ రాకముందే డోర్ ఎలా ఓపెన్ అయిందని మృతురాలి బంధువులు ప్రశ్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story