అత్త ముక్కు కొరికిన కోడలు

అత్త ముక్కు కొరికిన కోడలు
x
Highlights

* జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఘటన * రాత్రి గొడవ పడిన అత్త కోడలు

అత్త, కోడలు పంచాయితీ అందరికి తెలిసిందే.. మాట మాట తిట్టుకుంటారు. కొన్ని సార్లు మాటలతోనే పంచాయితీ సద్దుమణుగుతోంది. అయితే.. ఒక్కక్కసారి చేతిని కూడా వినియోగిస్తుంటారు. ఒకరి మీద ఒకరు చేయి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కలుస్తారు. జోగులంబ గద్వాల జిల్లాలో రగిలిన ఓ కోడలు అత్త ముక్కుమీద ప్రతాపం చూపింది. మాటలు, చేతులతో కాకుండా.. ఏకంగా నోటికే పని చెప్పింది. అత్త ముక్కును కోడలు కొరికింది.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కేంద్రంలో శారదమ్మ. తన చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. ఇంట్లో అత్త ఉండడాన్ని కోడలు రేవతికి ఇష్టం లేదు. దాంతో తరుచూ గొడవలు పడుతుండే వారు. శారదమ్మకు వయసు మీద పడడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. దీంతో కోడలు రేవతికి కోపం వచ్చేది.. దాంతో ఇంట్లో గొడవలు పడేవారు..

ఇదే సమయంలో సోమవారం రాత్రి అత్తకోడళ్లు గొడవ పడ్డారు. చిన్న గొడవ పెద్దగా మారింది. కోడలు రేవతి సహానం కోల్పోయింది. అంతే.. కోపంతో అత్త శారదమ్మ ముక్కును ఒక్కసారిగా కొరికింది. ఊహించని పరిణామంతో శారదమ్మ దిగ్భంతికి గురైంది. దాంతో ఆమె కోడలుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మానవపాడులో శారదమ్మ చికిత్స చేయించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories