కుటుంబ సభ్యులకు కరోనా.. మనోవేదనతో తల్లి మృతి

కుటుంబ సభ్యులకు కరోనా.. మనోవేదనతో తల్లి మృతి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కుప్పలుగా పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ కబలిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని ఆమనగల్లులో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే నాగర్‌ కర్నూలు జిల్లాలోని బైరాపూర్‌కు చెందిన వ్యక్తి తన కుటుంబంతో ఆమనగల్లులో జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆ వ్యక్తి మూడేళ్లక్రితం అనారోగ్యంతో కన్నుమూసాడు. కాగా అతని భార్య (60) అతని కుమారులు అక్కడే ఉంటున్నారు. కాగా గత కొద్ది రోజులుగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఈ కుటుంబానికి కూడా వ్యాపించింది. రెండు వారాల క్రితం ఆమె రెండో కుమారుడు, కోడలు, మనవడికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు బాధితులను వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స అనంతరం బాధితులను తిరిగి ఆమనగల్లుకు పంపారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇంటికి చేరుకున్న అనంతరం బాధితులు తప్పనిసరి హోం క్వారంటైన్ లో ఉండవల్సి ఉండడంతో వారు అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాధితుని తల్లి మనస్తాపానికి గురైంది. ప్రతి నిత్యం అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. కరోనా వైరస సోకని వారు కోలుకున్నప్పటికీ ఆ దిగులుతో బాదితుని తల్లి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories