తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత పోస్టులు : వ్యక్తి అరెస్ట్

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత పోస్టులు : వ్యక్తి అరెస్ట్
x
Sadhikbasa
Highlights

ఈ మధ్యకాలంలో ఎంతో మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎన్నో రకాల పోస్టులను చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఎంతో మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎన్నో రకాల పోస్టులను చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా తమని నచ్చని వారిపై కౌంటర్లు వేయడం, నచ్చిన వారిని మెచ్చుకోవడం ఇలా ఎన్నో వీడియోలను, ఫోటోలను, కొటేషన్లను పోస్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఎక్కువగా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఇతర మహిళా నేతలపై ఫేస్ బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో వారంతా పోలీసులను ఆశ్రయించగా పోస్టులు చేసిన వారిని పట్టుకుని జైలుకి పంపించారు. ఈ సంఘటన మరచిపోకముందే తాజాగా తెలంగాణ గవర్నర్‌ సౌందరరాజన్‌పై ఓ సహాయ నటుడు అనుచిత పోస్టులు చేసారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పూర్తివివరాల్లోకెళితే తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి అరిసికడై వీధికి చెందిన సాధిక్‌బాషా (39) కలవాణి–2 చిత్రంలో సహాయ నటుడిగా పనిచేసాడు. అలాగే ప్రస్తుతం కూడా సహాయ నటుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఇతను కొన్నిరోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై కు పరువునష్టం కలిగించే విధంగా ఫేస్ బుక్‌లో అనుచిత పోస్టు పెట్టాడు. అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై బీజేపి నేత రఘురామన్‌ మన్నార్‌గుడి నగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి అతన్ని అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తుచేసారు. అతని కోసం గాలింపు చర్యలు పట్టారు. అందులో భాగంగానే తిరుత్తురైపూండి సమీపం కట్టిమేడు గ్రామంలో తన అత్తగారింట్లో ఉన్న సాధిక్‌బాషాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories