ఆకులను తిన్న మేకలకు రూ.500 జరిమానా..

ఆకులను తిన్న మేకలకు రూ.500 జరిమానా..
x
Highlights

సాధారణంగా ఫైన్స్ ఎలా వేస్తారు..? ట్రాఫ్రిక్ రూల్స్ తప్పినప్పుడో.. లేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడో.. ఎదైన చట్టపరమైన వాటిని ఉల్లంగించనప్పుడు ఫైన్స్ (జరిమాన) విధిస్తారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా!

సాధారణంగా ఫైన్స్ ఎలా వేస్తారు..? ట్రాఫ్రిక్ రూల్స్ తప్పినప్పుడో.. లేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడో.. ఎదైన చట్టపరమైన వాటిని ఉల్లంగించనప్పుడు ఫైన్స్ (జరిమాన) విధిస్తారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా! అయితే మాటలు రానీ ముగజీవాలకు కూడా ఫైన్ వేసారు అక్కడి అధికారి. అదేంటి ఎక్కడైన మాటలు రానీ ముగజీవాలకు ఫైన్ వేయడం ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా? అవును ఇది నిజం. ఒక్కసారి ఈ కథనం చదివితే మీకే అర్థం అవుతోంది. చెట్టుకున్న ఆకులను తిన్నయని మేకలకు ఫైన్ వేశారు. ఈ వింత ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం అని తెలిసిందే కదా. దీంట్లో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు.

అయితే ఇందులో భాగంగానే చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలు నాటారు. అయితే అక్కడ నాటిన ఓ మొక్క ఆకులను మేకలు తీనేసాయి. ఈ సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి, సదరు మేక యజమానికి రూ.500 జరిమానా విధించారు. ఇంకోసారి ఇలాంటి ఘటన మళ్లీ రీపిట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే హరితహారం భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా, నష్టం చేయాలని చూసినా వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే అక్కడి ప్రాంత ప్రజలు ఈ ఘటనపై జోరుగా చర్చించుకుంటున్నారు. అసలు ఎక్కడైనా మాటలు రానీ మేకలకు జరిమాన విధిస్తారా? ఇలాంటి కొత్త రూల్స్ మన దగ్గరే ఉందా.. లేక తెలంగాణలో ఎక్కడైన ఉందా అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ విషయం తెలిసిన నెటిజన్లు, ప్రజలు ఇదేం వింత చర్య అని అనుకుంటున్నారు. ఇక ఈ విషయం ఆనోట ఈ నోట పడడంతో ఏకంగా ఈ వార్త సోషల్ మీడియా వరకు చేరింది. దీంతో ఇప్పడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories