Top
logo

మాగోడు వినండి సారూ : ప్రగతి భవన్ కు సామాన్యుడి కాల్

మాగోడు వినండి సారూ : ప్రగతి భవన్ కు సామాన్యుడి కాల్
Highlights

తెలంగాణా ప్రభుత్వం సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారుల నుండి ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని సిఎం దృష్టికి తీసుకెళ్ళడానికి తెలంగాణా ప్రభుత్వం హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబరుని ప్రవేశ పెట్టింది.

తెలంగాణా ప్రభుత్వం సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారుల నుండి ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని సిఎం దృష్టికి తీసుకెళ్ళడానికి తెలంగాణా ప్రభుత్వం హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబరుని ప్రవేశ పెట్టింది. అయితే ఇప్పుడు అదే నంబరుకు ఒక సామాన్య పౌరుడు కాల్ చేసి ఆర్టీసీ సమ్మె వలన వారు ఎదురుకుంటున్న సమస్యలను వెల్లబుచ్చాడు.

కాల్ చేసిన వ్యక్తి వివరాల్లోకెళితే కరీంనగర్ లో ఉంటున్న రంజిత్ కుమార్ అనే వ్యక్తి కాల్ చేసి ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రి వంటి వాడని, పిల్లలు అల్లరి చేస్తుంటే బుజ్జగించాలి తప్ప వారిని దండించొద్దు అన్నారు. తెలంగానని సాధించడానికి ఎన్నో చేసామని అన్నారు. అటువంటి ఉద్యమాలను అణచి వేయడం ఏంటని ప్రశ్నించాడు.

అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వం మొండి పట్టు వలన మధ్యలో సామాన్యులు నలిగిపోతున్నారన్నారు. పిల్లల పాటశాలలకు సెలవులు పొడిగించడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ విధంగా సెలవులు పొడిగిస్తూ పోతే పిల్లలు చదివిందంతా మరచిపోతారన్నారు. ఆర్టీసీ వాళ్లు సమ్మె చేస్తే, స్కూలు బస్సులను వాడుకోవడం ఏమిటన్నారు. ఈ విధంగా సీఎం కార్యాలయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తన గోడును వెలిబుచాడు.

Next Story