పాలమూరు జిల్లాను వణికిస్తున్న పాములు

పాలమూరు జిల్లాను వణికిస్తున్న పాములు
x
Highlights

ఇంటికి నుంచి పొలం వెళ్లిన రైతు ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో చేలల్లో పని చేస్తుంటారు అన్నదాతలు ఎక్కడ ఏ విష పురుగు కాటేస్తోందో చెప్పలేని పరిస్థితి.

ఇంటికి నుంచి పొలం వెళ్లిన రైతు ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో చేలల్లో పని చేస్తుంటారు అన్నదాతలు ఎక్కడ ఏ విష పురుగు కాటేస్తోందో చెప్పలేని పరిస్థితి. ఒక్క పాలమూరు జిల్లాలోనే జవనరి నుంచి ఇప్పటి వరకు 28మంది పాముకాటుతో మృత్యువాత పడ్డారు. పాముకాటు విరుగుడు మందు అందుబాటులో లేక ఎక్కువమంది చనిపోతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో పాములు కాటేసి కాటికి పంపుతున్నాయి. వర్షాలకు బయటికి వచ్చిన సర్పాలు ఇళ్లల్లో, చేలళ్లో ప్రజలను కాటేస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 28మంది పాముకాటుకు బలయ్యారు. బాధితులు మొదట ఆసుపత్రికి వెళ్లకుండా మంత్రగాళ్లను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో విష సర్పాలు తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి 25 రోజుల్లో 56 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడుగురు చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులున్నారు.

పాముకాటు బాధితుల్లో ఎక్కువ మంది నాటు వైద్యులను , ఆర్ఎంపీలను గ్రామాల్లో ఉండే మంత్రగాళ్లను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంత అవగాహన ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు పీహెచ్‌సీలకు వెళుతున్నారు. అప్పటికే ఆలస్యం కావడం, ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో యాంటీ వీనం మందును కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. చాలాచోట్ల ఫ్రిడ్జ్‌ సౌకర్యాలు లేకపోవడం వల్ల మందులు లేక ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో పాముకాటు బాధితులు ఆసుపత్రికి వచ్చేసరికే మృత్యువాత పడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories