కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

1crore Tree plantation program in Telangana As KCR Birthday Special
x

green India poster release 

Highlights

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని...

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని మరింత పచ్చగా మార్చాలనే సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా.. ప్రతి తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని కానున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాదు సంరక్షించే బాధ్యత తీసుకోవడమే సీఎం కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను కవిత అభినందించారు. అనంతరం సంతోష్‌కుమార్‌తో కలిసి ఆమె పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories