రెండు నిండు ప్రాణాలు కాపాడిన చిన్నారి

రెండు నిండు ప్రాణాలు కాపాడిన చిన్నారి
x
Highlights

ఎంతో మంది పిల్లలు సమయస్పూర్తితో వ్యవహరించి ఎన్నో విజయాలను సాధించారు.

ఎంతో మంది పిల్లలు సమయస్పూర్తితో వ్యవహరించి ఎన్నో విజయాలను సాధించారు. అదే తరహాలో ఓ 11 ఏళ్ల బాలిక ఆత్మస్థైర్యంతో, సమయస్పూర్తితో వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను కాపాడి ఆమె కూడా ప్రాణాలను దక్కించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే శుక్రవారం రాత్రి ఓ కుటుంబం మోర్తాడ్‌ నుంచి ఆర్మూర్‌కు వెళ్తుండగా వేల్పూర్‌ మండలం కుకునూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మోర్తాడ్ కు చెందిన శ్రీనివాస్, ఆయన భార్య లావణ్య, కూతురు హర్షిత(11), అతడి స్నేహితుడు కృష్ణతేజ ఉన్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అక్కడిక్కడే మృతి చెందరగా, అతని భార్య లావణ్య, అతని స్నేహితుడు కృష్ణతేజ, కూతురు హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారితో లావణ్య, కృష్ణతేజ అపస్మారక స్థితికి చేరుకున్నారు. కాగా అతని భార్య కూతురు హర్షితపై ఒదిగిపోయారు.

కొన్ని దెబ్బలతో బయట పడిన హర్షిత తన తల్లిని తండ్రిని, వారితో వచ్చిన అతన్ని ఎంత పిలిచినా పలకలేదు. దీంతో ఏం చేయాలో తెలియని హర్షిత వెంటనే కారు అద్దం పగులగొట్టి బయట వెళ్లే వారిని తమకు సాయం కావాలని రోడ్డున పోయే వారిని బతిమిలాడింది. అయినా వాహనాల్లో వెళ్లే వారు ఎవరూ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా ప్రయత్నిస్తున్న సమయంలో వేరే రాష్ట్రానికి నడుచుకుంటూ వెలుతున్న ఓ వ్యక్తి పరిస్ధితిని అర్ధం చేసుకుని ఆ చిన్నారిని బయటకు తీశాడు. ఈ తరువాత ఆ చిన్నారి హర్షిత తన తండ్రి ఫోన్‌ తీసుకుని ముందుగా 108కు కాల్ చేసి సమాచారం అందించి, తరువాత తన తండ్రి స్నేహితుడు దామోదర్‌కి ఫోన్‌ చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బంది లావణ్య, కృష్ణతేజ, హర్షితకు ప్రథమ చికిత్స చేసారు. ఆ తరువాత వారిని ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందే దామోదర్‌కు సంఘటన గురించి హర్షిత వివరించడంతో వారు మోర్తాడ్‌ నుంచి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం లావణ్య, కృష్ణతేజ, హర్షిత ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories