లక్షా 46వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌

లక్షా 46వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌
x
Highlights

019-20 సంవత్సరానికి రూ. 1, 46,496.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు.

2019-20 సంవత్సరానికి రూ. 1, 46,496.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు గా చెప్పిన ముఖ్యమంత్రి బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు అని ప్రకటించారు.

ఇక తెలంగాణా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్‌లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించినపుడు నిర్దిష్టమైన ప్రతిపాదికలు ఏమీ లేవనీ, అయితే వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడంతో, ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందాని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు ఉందన్నారు. ఇక రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందనీ, వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశామనీ తన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

నిరంతరంగా తెలంగాణా బడ్జెట్ విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories