లాజిస్టిక్ హబ్ లో కమర్షియల్‌ ఆపరేషన్‌ పనుల ప్రారంభం

లాజిస్టిక్ హబ్ లో కమర్షియల్‌ ఆపరేషన్‌ పనుల ప్రారంభం
x
Highlights

రంగారెడ్డి జిల్లా మంగళ్‌పల్లి సమీపంలో హెచ్‌ఎండీఏ- అంకాన్‌ లాజిస్టిక్స్‌ పార్కును శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిని కేటీఆర్‌ స్తారంభించారు.

రంగారెడ్డి జిల్లా మంగళ్‌పల్లి సమీపంలో హెచ్‌ఎండీఏ- అంకాన్‌ లాజిస్టిక్స్‌ పార్కును శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిని కేటీఆర్‌ స్తారంభించారు. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్‌ ఆపరేషన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి చెందుతుందన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మరో 8 లాజిస్టిక్స్‌ పార్కుల నిర్మాణానికి ప్రజాళికలు సిద్ధం చేశామని ఆయన వివరించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మంగళ్‌పల్లి లాజిస్టిక్స్‌ పార్కులో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. టాన్క్‌ ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుందన్నారు. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ఎ, లిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుందని ఆయన తెలిపారు. వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగు నీటిని అందిస్తున్నారు. కుంట్లూర్‌లో ఎస్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇదే అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్‌ రెడ్డి మాట్లాడుతూ లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న ఒక్కో మునిసిపాలిటీకి రూ. పది కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్‌ అనితా రెడ్డి, ఎండీ ఆంకాన్‌ మాట్లాడుతూ లాజిస్టిక్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన స్పూర్తితో త్వరగానే పూర్తిచేయిస్తామని తెలిపారు. ఈ లాజిస్టిక్‌ పార్క్‌ల ఏర్పాటు వల్ల అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్నారు. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories