డిగ్రీ పట్టా కోసం విద్యార్ధినుల కుస్తీ

డిగ్రీ పట్టా కోసం విద్యార్ధినుల కుస్తీ
x
Highlights

వాళ్లు చదువుతోంది డిగ్రీ కానీ ప్రైమరీ చదువుల కన్న అధ్వానంగా తయారైంది. హైక్వాలిటీతోనే హైస్కూల్ నడుస్తున్నా...ఈ డిగ్రీ కాలేజ్‌లో మాత్రం అవేవి కనిపించవు నేల మీద‌ కూర్చొని డిగ్రీ పట్టా కోసం కుస్తీ పడుతున్నారు.

వాళ్లు చదువుతోంది డిగ్రీ కానీ ప్రైమరీ చదువుల కన్న అధ్వానంగా తయారైంది. హైక్వాలిటీతోనే హైస్కూల్ నడుస్తున్నా...ఈ డిగ్రీ కాలేజ్‌లో మాత్రం అవేవి కనిపించవు నేల మీద‌ కూర్చొని డిగ్రీ పట్టా కోసం కుస్తీ పడుతున్నారు. నేలపై కూర్చోని చదువుకుంటున్న విద్యార్ధినిల దీనస్థితిపై ప్రత్యే్క కథనం. ఫర్నీచర్స్‌ లేక నేలపైనే కూర్చొని చదువుతున్న విద్యార్ధినుల ధీనస్థితి చూస్తే జాలేస్తోంది. విద్యారంగంలో ఆధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్న విద్యార్ధులు కూర్చూనేందుకు బల్లలు లేని దౌర్భగస్థితి నల్గొండ జిల్లా రామగిరిలోని మహిళ డిగ్రీ కాలేజ్‌లోనిది.

ఫస్ట్ ఇయర్ ,సెకండ్ ఇయర్ ,ఫైనల్ ఇయర్ విద్యార్ధినిలు ఇలా మొత్తం కలిసి 2200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో తరగతిలో 160పైగా విద్యార్ధులు ఉన్నారు. విద్యార్ధినిలకు సరిపడ తరగతి గదులు ఉన్నా కూర్చునేందుకు బెంచీలు లేకపోవడం తో ‌విద్యార్ధినిలు నేల పైనే కూర్చొని అనేక ఇబ్బందులు పడుతూ డిగ్రీ చదువును నెట్టుకొస్తున్నారు. తెలంగాణ లోనే మహిళ డిగ్రీ కాలేజ్‌లో రామగిరి మహిళ డిగ్రీ కాలేజ్ టాప్ కాలేజ్‌. జిల్లాలో ఈ కాలేజ్‌ కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుబాటులో టీచింగ్‌ స్టాప్ట్‌, నాణ్యమైన విద్య, మంచి ఫలితాలకు కేరాఫ్‌ అయినా పరిస్థితి మాత్రం దారుణం. . క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ కాలేజ్‌లో సీట్‌ దొరకడమే గగనమే అయినా... చదువుకోవడానికి నానా ఫీట్లు చేస్తున్నారు. విద్యార్ధులకు బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చోని వింటున్నారు.ప్రాధమిక ,హైస్కూల్, ఇంటర్‌లో బెంచీలపై కూర్చొని చదిమాని... ‌‌ఇక్కడ మాత్రం బెంచీలు లేకపోవడంతో నేలపై కూర్చోని చదవాల్సింది వస్తోందని విద్యార్ధినులు ఆవేదన చెందుతున్నారు.

గంటల తరబడి కూర్చోలేకపోతున్నామని పైగా లెక్చరర్లు చెప్పే విషయాలపై శ్రద్ధపెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. వందలాది మంది విద్యార్ధినులు చదువుతున్న కాలేజీలో బెంచీలు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్‌ వేడుకుంటున్నారు. కూర్చీలు లేకపోవడం వల్ల మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి డిగ్రీ పట్టాకోసం నేలపై చదువుకుంటున్న విద్యార్ధుల సమస్యలను పరిష్కారించాలని విద్యార్ధినులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories