ఆర్టీసీ సమ్మెలో ఆగిన మరో గుండె

ఆర్టీసీ సమ్మెలో ఆగిన మరో గుండె
x
Highlights

ఆర్టీసి కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మె నేటికి 12వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలపై స్పందించకపోవడంతో

తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ గుండె ఆగిపోయింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ సమ్మెతో కార్మికుల ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యంలో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా మియాపూర్‌-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేసే ఎరుకల లక్ష్మయ్య గౌడ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లాలోని మర్రిగూడవాసి. ఈ సంఘటన గత శుక్రవారం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లక్ష్మయ్య మృతికి నిరసనగా మియాపూర్‌ డిపో ఎదుట తోటి ఆర్టీసీ కార్మికులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

ఇక మరోవైపు ఆర్టీసి కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మె నేటికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మె నేపధ్యంలో కొంత మంది కార్మికులు ప్రాణత్యాగానికి కుడా వెనుకాడలేదు. ఖమ్మం డిపో డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహుతి చేసుకుంటే, రాణిగంజ్‌ బస్‌​ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సురేందర్‌ గౌడ్‌ ఉరివేసుకున్నాడు. హెచ్‌సీయూ బస్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సందీప్‌ బ్లేడ్‌తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కాగా, ఆందోళనతో గుండె ఆగిన ఘటనలలో కూడా ఇప్పటివరకూ ముగ్గురు మృతి చెందారు. చెంగిచర్లలో ఒక డ్రైవర్, హైదరాబాదు లోనే హేచ్సియూ దిపోకి చెందిన ఒక డ్రైవర్ గుండె నొప్పి తొ మృతి చెందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories