వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన 1200 గొర్రెలు..

వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన 1200 గొర్రెలు..
x
Highlights

మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా పెరిగిన వదర ఉధృతికి.. సుమారు12వందల గొర్రెలు కొట్టుకుపోయాయి. చొక్కారావుపల్లె వద్ద 10 మంది గొర్రెల కాపర్లతో పాటు.. రెండు వేల గొర్రెలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా పెరిగిన వదర ఉధృతికి.. సుమారు12వందల గొర్రెలు కొట్టుకుపోయాయి. చొక్కారావుపల్లె వద్ద 10 మంది గొర్రెల కాపర్లతో పాటు.. రెండు వేల గొర్రెలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. గొర్రెల కాపర్లను కాపాడారు. మిడ్‌మానేరు నుంచి నీటి విడుదలపై దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వకుండా.. నీటిని విడుదల చేలేదని గొర్రెల కాపరులు ఆరోపిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి రాత్రి సమయంలో నీటి విడుదలు చేస్తున్నట్టు.. దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అర్థరాత్రి మిడ్‌మానేరు 5 గేట్లలను ఎత్తిన అధికారులు.. 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతంలో వదర ఉధృతి పెరిగి 1200 గొర్రెలు నీటి కొట్టుకుపోయాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories