ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్
x
Highlights

మహిళా పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి మిస్సింగ్ కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు శనివారం సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

మహిళా పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి మిస్సింగ్ కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు శనివారం సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. పోలీసులు కేసును నమోదు చేసుకోవడం ఆలస్యం చేయడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో సామూహిక హత్యాచారం చేసి ఆమెని అతి దారుణంగా చంపేసారు. అప్పుడు మేల్కొన్న పోలీసులు ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారించారు.

ఈ సంఘటనతో స్పందించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సి. సజ్జనార్ కేసునమోదు చేసుకోని పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. శనివారం నవంబర్ 27 మరియు 28 మధ్య రాత్రి తప్పిపోయిన మహిళకు సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం వారు ఆలస్యం చేసినట్లు విచారణలో తేలినట్లు శనివారం రాత్రి కమిషనర్ కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ కేసులో సస్పెండ్ అయిన వారిలో ఎం. రవికుమార్, సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ పోలీస్ స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA) పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పి.వేణుగోపాల్ రెడ్డి, ఎ. సత్యనారాయణ గౌడ్ లు ఉన్నారు.

అధికార పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసులు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు.పోలీసుల వద్దకు ప్రియాంక కుటుంబీకులు తాను కనిపించడంలేదంటూ రాత్రి 11 గంటలకు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినపుడు పోలీసులు త్వరగా స్పందించలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించింది. రెండు పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న అధికార పరిధిపై పోలీసులు చాలా సమయం వృధా చేయడమే కాకుండా, తగని ప్రశ్నలు అడిగారని వారు తెలిపారు.

ప్రియాంక రెడ్డి తన సోదరికి మొబైల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి తనతో మాట్లాడిన ఒకటిన్నర గంటల తరువాత పోలీసులను ఆశ్రయించామని తెలిపింది. ఆమె స్కూటీ పంక్చర్ కావడంతో ఆమె షంషాబాద్ వద్ద టోల్ గేట్ దగ్గర చిక్కుకుపోయాయని తనకు ఫోన్ చేసిందని తెలిపింది. తాను ఉన్న స్థలంలో ఎవరూ ఉండకపోవడంతో తాను భయపడుతున్నానని బాధితురాలు తనకు చెప్పిందని ప్రియాంక రెడ్డి సోదరి తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories