5G Technology: 5G టెక్నాలజీ అంటే ఏంటి.. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయ్‌..!

What is 5G technology What are its uses check all details
x

5G Technology: 5G టెక్నాలజీ అంటే ఏంటి.. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయ్‌..!

Highlights

5G Technology: 5G టెక్నాలజీ అంటే ఏంటి.. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయ్‌..!

5G Technology: ఇంటర్ నెట్ వినియోగదారులు త్వరలో దేశవ్యాప్తంగా 5G సేవలని ఆస్వాదిస్తారు. దాదాపు 5 సంవత్సరాలలో 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండవచ్చు. దేశంలోని టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా తదితర నెట్‌వర్క్‌లు 5G సేవలని ప్రారంభించబోతున్నాయి. దీనివల్ల 5G సర్వీస్ ప్రొవైడర్లకి కూడా మంచి ఆదాయం సమకూరనుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

5G టెక్నాలజీ ప్రధానంగా స్టాండలోన్, నాన్-స్టాండలోన్ అనే రెండు మోడ్‌లపై ఆధారపడి ఉంటుంది. 5G వేగం 4G కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెక్నాలజీ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల నెటిజన్లు అనేక ప్రయోజనాలని పొందుతారు. 5G అంటే ఐదవ జనరేషన్ మొబైల్‌ నెట్‌వర్క్‌ (Fifth Generation Mobile Network) వినియోగదారుగా వేగవంతమైన ఇంటర్నెట్ వేగం, అంతరాయం లేని సేవలు, HD వీడియో సర్ఫింగ్, మరెన్నో చూస్తారు.

5G ప్రస్తుత 4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. 2 GB సినిమా 10 నుంచి 20 సెకన్లలో డౌన్‌లోడ్ అవుతుంది. WhatsApp, Google Duo లేదా Messengerలో వీడియో కాల్‌లు నాన్‌స్టాప్‌గా మాట్లాడుకోవచ్చు. YouTube లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లో HD వీడియోలు బఫరింగ్ లేకుండా ప్లే అవుతాయి. డ్రైవర్‌ రహిత మెట్రో ఆపరేషన్‌ సులువవుతుంది. డ్రైవర్ లేని కారు కూడా సాఫీగా నడుస్తుంది.హోటల్స్, హాస్పిటాలిటీలో రోబోట్ టెక్నాలజీని ఉపయోగించడం సులువవుతుంది.

విద్య,వైద్య రంగాల్లో అనేక మార్పులు జరుగుతాయి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. వీడియో గేమింగ్ రంగంలో 5G రాక విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా మరిన్ని కంప్యూటర్లను కనెక్ట్ చేయడం సులభం అవుతుంది. వర్చువల్ రియాలిటీ ప్రపంచం రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. 5G టెక్నాలజీ మీ ఇంటర్నెట్ ఆధారిత ప్రపంచాన్ని పూర్తిగా మారుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories