Lava Blaze 5G: లావా నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Lava Blaze 5G: లావా నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Rama Rao
Updated on: 4 Nov 2022 6:17 PM IST
Lava Blaze 5g Smartphone how About the Price Features
X

Lava Blaze 5g: లావా నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Lava Blaze 5G: లావా మొబైల్స్‌ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 7న లాంచ్‌ చేయబోతుంది.ఈ మొబైల్ పేరు Lava Blaze 5G. దీనిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సందర్భంగా పరిచయం చేశారు. ఈ మొబైల్ ధరపై ఇంకా ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో Blaze 5G గురించి పెద్దగా ఎటువంటి సమాచారం అందించలేదు. అయితే ఈ మొబైల్ గురించి కొన్ని విషయాలు మాత్రం తెలుసుకుందాం.

లావా నుంచి రాబోయే ఈ 5G మొబైల్ ఫోన్ సరసమైన 5G హ్యాండ్‌సెట్ అవుతుంది. దీని ధర దాదాపు 10 నుంచి 13 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇది బ్లూ, గ్రీన్ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ప్రధాన స్పెసిఫికేషన్ గురించి చెప్పాలంటే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్‌లు

లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే ఇది 6.5-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది HD రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 720 x 1600 పిక్సెల్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో పని చేస్తుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో వస్తుంది. అలాగే ఇందులో 4 జీబీ ర్యామ్, 3 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటాయి. ఈ మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మైక్రోఎస్‌డీ కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ గురించి సమాచారం ఇవ్వలేదు.

Rama Rao

Rama Rao

Next Story