కోరుకున్న ప్రత్యర్థి తో కోహ్లీ సేన

కోరుకున్న ప్రత్యర్థి తో కోహ్లీ సేన
x
Highlights

ఆ రెండు జట్ల ఆటతీరుకూ ఏ మాత్రం పొంతన లేదు. రెండిటి వరల్డ్ కప్ ప్రస్థానం మధ్య అంతరం కొండంత. అవి భారత్, న్యూజిలాండ్ జట్లు. టీమిండియా ఎనిమిది మ్యాచ్ లు...

ఆ రెండు జట్ల ఆటతీరుకూ ఏ మాత్రం పొంతన లేదు. రెండిటి వరల్డ్ కప్ ప్రస్థానం మధ్య అంతరం కొండంత. అవి భారత్, న్యూజిలాండ్ జట్లు. టీమిండియా ఎనిమిది మ్యాచ్ లు ఆది ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల అగ్రస్థానం సాధించిన జట్టు. టోర్నీలో ఉన్న బలహీనమైన జట్లమీద ప్రతాపం చూపించి నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో నిలిచారు కివీస్. ఈరోజు ఈ రెండు జట్ల మధ్య మొదటి సెమీస్ జరగబోతోంది. ఈ పోటీలో కచ్చితంగా భారతే హాట్ ఫేవరేట్. అభిమానులే కాదు.. అందరి మాటా ఇదే. జట్ల బాలాబలాలు.. వరల్డ్ కప్ లో చూపించిన ప్రతిభ.. గణాంకాలు అన్నీ టీమిండియా కే విజయావకాశాలు ఉన్నాయని నిరూపిస్తున్నాయి. ప్రపంచ కప్ లో ఇంతవరకూ ఏడూ సార్లు సెమీస్ ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమె ఫైనల్ చేరగలిగింది. అయితే, ఇపుడు రెండు జట్లూ ఒకే స్థితిలో పోటీ పడుతున్నాయి. రెండిటికీ ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచే. ఇంకో చాన్స్ కచ్చితంగా లేదు. ఈరోజు ఏ టీం బాగా ఆడుతుందో.. ఎవరి వైపు అదృష్టం ఉంటుందో వాళ్ళే కప్ వేటలో ముందడుగు వేయగలుగుతారు. గత ప్రదర్శనల హైలైట్స్ ఈ మ్యాచ్ లో పనికిరావు. ఎవరు ఒత్తిడిని తట్టుకుని నిలుస్తారో వారే విజేతలు. ఒత్తిడి విషయానికి వస్తే న్యూజిలాండ్ కంటే కూడా భారత్ పైనే ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎందుకంటే, టోర్నీ ప్రారంభం కావడానికి చాలా ముందు నుంచే ప్రపంచ కప్ గెలిచే సత్తా ఉన్న జట్లలో ఇండియాకే అగ్రస్థానం ఇస్తూ అంచనాలున్నాయి. పైగా అప్రతిహతంగా సెమీస్ చేరింది. దీంతో కచ్చితంగా భారత్ జట్టే ఫైనల్ కి వెళుతుందనే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమేరకు టీమిండియా పైనే ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పైగా.. ఎంత పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించినా అది అంత సులువుగా జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్ టీముపై చెమటోడ్చి గ్రూపు దశలో గెలిచారు. అదేవిధంగా బంగ్లాదేశ్ మ్యాచ్ లోనూ ఒత్తిడికి గురయ్యారు భారత క్రికెటర్లు. ఒక్కోసారి ఉదాశీనతా కొంప ముంచుతుంది. మనకేం ఫర్వాలేదనుకుంటే కొంప మునుగుతుంది. ఇప్పుడు టీమిండియా గెలవాలని యావత్ భారతం కోరుకుంటోంది. ఆ మేరకు జట్టు రాణించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకుని.. ఉదాశీనతను ఒదిలిపెట్టి.. కోహ్లీ అండ్ కో అప్రమత్తతతో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అదే ఈ మ్యాచ్ లో కీలకమైనది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories