లక్ష్యం కోసం బ్రెస్ట్ సైజునే తగ్గించుకుంది!

లక్ష్యం కోసం బ్రెస్ట్ సైజునే తగ్గించుకుంది!
x
Highlights

చరిత్ర సృష్టించాలని అందరికీ ఉంటుంది. కానీ, దానికోసం త్యాగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. లక్ష్యం నిర్దేశించుకున్నాకా.. దానిని చేరే మార్గంలో ఏది అడ్డని...

చరిత్ర సృష్టించాలని అందరికీ ఉంటుంది. కానీ, దానికోసం త్యాగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. లక్ష్యం నిర్దేశించుకున్నాకా.. దానిని చేరే మార్గంలో ఏది అడ్డని పించినా దానిని దాటడానికి ప్రయత్నించాల్సిందే. దాటి తీరాల్సిందే. దాటితేనే విజేతగా నిలవగలుగుతారు. అటువంటి విజేతే హలెప్.

మహిళా టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ ను వింబుల్డన్ లో ఎదుర్కోవడం మాటలు కాదు. ఎదుర్కున్నా విజయం అదీ.. సాధికారికంగా సాధించడం అంత ఈజీ కాదు. కానీ, ఎంతో ఈజీగా సెరీనా ను ఖంగు తినిపించి 2019 వింబుల్డన్ విజేతగా నిలిచింది హలెప్.

ఆట కోసం ఎంతగానో శ్రమించిన హలెప్.. తన తల్లి కోరికను నెరవేర్చాలనే లక్ష్యంతో 16 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలింది. అక్కడ నుంచి తన లక్ష్యం దిశగా కఠోర శ్రమ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె ఎవరూ ఊహించను కూడా ఊహించని త్యాగం చేసింది. తన ఆట తీరును ప్రభావితం చేస్తోందని తెలిసి తన బ్రస్ట్ ను ఆపరేషన్ ద్వారా తీయిన్చుకుంది. ఆమె కేవలం 17 ఏళ్ల వయసులో ఉన్నపుడు ఆమె బ్రెస్ట్ సైజ్ 34DD. దాంతో ఆమె ఆటతీరు చాలా ప్రభావితం అయ్యేది. చాలా ఇబ్బంది పడేది. ఇది తన లక్ష్యానికి అద్దంకి అని భావించిన ఆమె బ్రెస్ట్‌ రిడక్షన్‌ సర్జరీతో 34C సైజుకు తగ్గించుకుంది. 2009 లో తాను ఈ సర్జరీ చేయించుకుంది. కేవలం టెన్నిస్ కోసమే.. ఆ పని చేశాననీ, అదే తనను ఈ విజయానికి చేరువ చేసిందనీ హలెప్ చెప్పింది. అయితే, ఇదేమీ పెద్ద త్యాగం అనుకోవడం లేదనీ, ఇది ఆట మీద మక్కువ..తన తల్లి కోసం ఈ పని చేశాననీ ఆమె వింబుల్డన్ విజయం అనంతరం తెలిపింది. త్యాగం తో లక్ష్యాన్ని చేరిన ఆమె ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories